3000 ఉద్యోగావకాశాల్ని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ

3000 ఉద్యోగావకాశాల్ని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరిటైజేషన్‌ ఖాళీగా వున్న 3,000 ఉద్యోగాలకు సంబంధించి తీపి కబురు చెప్పింది ఉద్యోగార్థులకి. అబుదాబీ ఛాంబర్‌లో స్ట్రాటజిక్‌ పార్టనర్స్‌, పలు ప్రైవేటు కంపెనీలకు చెందిన హ్యూమన్‌ రిసోర్సెస్‌ పర్సనల్‌ హాజరయిన ఓ మీటింగ్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. నేషనల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ రిక్రూట్‌మెంట్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫరీదా అబ్దుల్లా అల్‌ అలి మాట్లాడుతూ, ప్రైవేట్‌ సెక్టార్‌లో ఎమిరటైజేషన్‌ను 5 శాతానికి పెంచడానికి మినిస్ట్రీ ప్లాన్‌ చేస్తోందని చెప్పారు. ప్రస్తుత ఎమిరటైజేషన్‌ శాతం 3.35గా వుంది ఈ సెక్టార్‌లో. 

Back to Top