యూఏఈలో ఇలా చేస్తే 1 మిలియన్‌ దిర్హామ్‌ల జరీమానా

యూఏఈలో ఇలా చేస్తే 1 మిలియన్‌ దిర్హామ్‌ల జరీమానా

దుబాయ్‌: ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలపై ఇతరులతో ఇంటరాక్ట్‌ అయ్యే సమయంలో అప్రమత్తంగా వుండాలి. ఫాల్స్ న్యూస్‌ని పోస్ట్‌ చేసినా, షేర్‌ చేసినా భారీగా జరీమానాలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ జరీమానా 1 మిలియన్‌ దిర్హామ్‌ వరకు వుంటుంది. టెలికమ్యూనికేషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ), సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రూమర్స్‌ కావొచ్చు, తప్పుడు వార్తలు కావొచ్చు, విద్వేషపూరితమైన విషయాలు కావొచ్చు, మీ దృష్టికి వస్తే, వాటి జోలికి వెళ్ళొదు. వీలుంటే, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేగానీ, వాటిని తిరిగి ఎవరికైనా పంపితే మాత్రం చిక్కులు ఎదురవుతాయి. టిఆర్‌ఏ ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్ పెట్టింది. యూఏఈ యాంటీ సైబర్‌ క్రైమ్‌ చట్టం ప్రకారం ఉల్లంఘనులకు 1 మిలియన్‌ దిర్హామ్‌ల వరకు జరీమానా పడుతుందని టిఆర్‌ఏ పేర్కొంది. షేర్‌ చేసిన మెసేజ్‌ని బట్టి ఉల్లంఘనను నిర్ధారించి జరీమానా శిక్ష విధించడం జరుగుతుంది. అత్యధిక జరీమానా 1 మిలియన్‌ దిర్మామ్‌లు. సో, బీ కేర్‌ ఫుల్‌.

 

Back to Top