హెల్ప్ చేయండి ప్లీజ్..జాకీ చాన్ కూతురి విన్నపం
- May 01, 2018హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ కూతురు 19 ఏళ్ళ ఎట్టా ఇంగ్ తనకు హెల్ప్ చేయాలంటూ అందర్నీ అభ్యర్థిస్తోంది. తండ్రి అంత పెద్ద నటుడయినా ఈమె మాత్రం హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జీల కింద తలదాచుకుంటున్నదట! ఇంగ్, ఆమె గర్ల్ ఫ్రెండ్ ఆండీ ఆటమ్.. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలో..తమ దయనీయ పరిస్థితి గురించి చెప్పుకున్నారు. ఇల్లు లేని తాము నెల రోజులుగా రోడ్లపైనే ఉంటున్నామని, తమకు ఎవరైనా సహాయం చేయాలని వారు ఈ వీడియోలో కోరారు. స్వలింగ సంపర్కులను వ్యతిరేకించే తమ తలిదండ్రులే తమ దుస్థితికి కారణమని వారు వాపోయారు. జాకీని తన తండ్రిగా తాను ఎప్పుడూ పరిగణించ లేదని, అసలు అతడు తన జీవితంలోనే లేడని ఎట్టా ఇంగ్ 2015 లోనే తెలిపింది. మాజీ బ్యూటీ క్వీన్ ఇలైన్ ఇంగ్ తో గతంలో జాకీ చాన్ ఎఫైర్ నడిపించగా..ఎట్టా ఇంగ్ పుట్టింది. అంతకు ముందే అతగాడు తన మొదటి భార్యతో సుమారు 35 సంవత్సరాలు కాపురం చేశాడు. ఎట్టా గురించి జాకీ ఎప్పుడూ నోరు విప్పకపోయినా, ఇలైన్ తో తను ప్రేమాయణం నడిపిన మాట నిజమేనని అంగీకరించాడు. కాగా..ఎట్టా లెస్బియన్ అనే ప్రచారం ఆ మధ్య సాగింది. బహుశా అందుకే జాకీ చాన్, ఇలైన్ ఆమెను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అటు-తాజాగా ఎట్టా పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన ఇలైన్.. తన కూతురు ఎట్టా వద్ద డబ్బులు లేకపోతే ఏదైనా పని చూసుకోవాలని, అంతేగానీ సహాయం చేయాలంటూ ఇలా వీడియో పోస్ట్ చేయడం ఏమిటని మండిపడింది. ఇంగ్, ఆండీ ఆటమ్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 49 మిలియన్ డాలర్ల ఆస్తికి పడగలెత్తిన హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కూతురి దురవస్థ చాలామందిని కదిలించినా.. ఇంకా మేమున్నామంటూ ఎవరూ ఆమెను ఆదుకునేందుకు ముందుకు రాలేదు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్‌లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..