'ఆమె'ను చూడగానే ఫస్ట్‌లుక్‌ లోనే ప్లాట్: మెగాస్టార్ 'చిరు'

- May 01, 2018 , by Maagulf
'ఆమె'ను చూడగానే ఫస్ట్‌లుక్‌ లోనే ప్లాట్: మెగాస్టార్ 'చిరు'

సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ జంటగా నటించిన సమ్మోహనం చిత్రాన్ని ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో మెగాస్టార్ చిరంజీవి విడుదలచేశారు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర యూనిట్‌ని చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు చిరంజీవితో సరదాగా చిట్ చాట్ చేశారు. ముందుగా సుధీర్ చిరంజీవిని ప్రశ్నిస్తూ మీరు చేసిన సినిమాలు రుద్రవీణ, ఆరాధన, ఆపద్బాంధవుడు ఇలాంటి అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టేవారు. ఆ తరువాత కాలంలో అలాంటి టైటిల్స్ మిస్సవుతున్నాం. మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలవుతోంది. దీనికి మీరెమంటారు అంటే .. చిరంజీవి ఇది చాలా సంతోషకర పరిణామం. అలా వచ్చిన మొన్నటి రంగస్థలం, నిన్నటి భరత్ అనే నేను, రేపు సమ్మోహనం .. ఇలా చాలా బావుంటున్నాయి టైటిల్స్. ఈ మార్పు చాలా ఆనందంగా ఉందన్నారు.  సురేఖ గారిని చూసి మీరు సమ్మోహితులు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని సుధీర్ అడిగితే.. అవును సురేఖని చూసిన ఫస్ట్‌లుక్‌ లోనే సమ్మోహితుడిని అయ్యాను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. సమ్మోహనం టీజర్ చూస్తుంటే ఇది చాలా స్ట్రాంగ్ లవ్ స్టోరీ అని అనిపించిందన్నారు చిరంజీవి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com