కేసిఆర్ కే మా పూర్తి మద్దతు:అఖిలేష్
- May 02, 2018
హైదరాబాద్:సమాఖ్య స్ఫూర్తి ప్రతిబింబించేలా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. కూటమిపై చర్చల కోసం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్..సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్న అఖిలేష్..తెలంగాణ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఫెడరల్ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్.. రిజినల్ పార్టీస్ ఫ్రంట్..పేరు ఏదైనాగానీ..జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాల్లో మరో అడుగు పడింది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కర్ణాటకలో జేడీఎస్ నేత దేవేగౌడ, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో పాటు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. ఇక ఇప్పుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో ఫ్రంట్ ఉద్దేశ్యం..అవసరాలపై చర్చించారు కేసీఆర్.
కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్‌కు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదవ సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రగతిభవన్ చేరుకున్న అఖిలేష్‌ను స్వాగతించిన కేసీఆర్.. అయనకు ప్రగతిభవన్‌లోనే భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల కూటమి అవసరాన్ని అఖిలేష్‌కు వివరించారు సీఎం. అయితే..తమ లక్ష్యం 2019 ఎన్నికలు కాదన్న సీఎం.. ఫ్రంట్ అంటూ పేర్లు పెట్టొద్దన్నారు. జాతీయ పార్టీల పాలన ఆశించిన అభివృద్ధి జరగలేదని..ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి అవసరమని అన్నారు.
కేసీఆర్ ప్రయత్నాలకు తాను పూర్తి మద్దతు ఇస్తానన్న అఖిలేష్..బీజేపీ, కాంగ్రెసేతర కూటమిపై మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. రాజకీయల్లో పరివర్తన కోసం జరుగున్న ప్రయత్నాలు తొలి దశలోనే ఉండగానే కూటమిలో ఏ పార్టీ ఉంటుంది..ఏ పార్టీ ఉండదు అని నిర్ణయించలేమంటూ కాంగ్రెస్‌తో చెలిమిపై మాట దాటేశారు. జాతీయ రాజకీయాల్లో పరివర్తన ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న కొద్ది.. కూటమిలో కలిసొచ్చే పార్టీలపై చర్చ కూడా జోరందుకుంటోంది. అయితే..కేసీఆర్ మాత్రం తమ ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడొద్దని అంటున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. ప్రయత్నాలు కొనసాగే కొద్ది ఇంకా చాలమందితో సంప్రదిస్తామంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!