వేగంతో వీస్తున్న గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. భయాందోళనలో జనం..
- May 02, 2018
అండమాన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి, రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మణిపూర్ వరకు మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటన్నంటి ప్రభావంతో కోస్తాంధ్రలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు పడ్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురంలో గంటకు పైగా కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పిడుగులు పడడంతో జనం తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడింది. ఏజేన్సీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు