ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్‌తో డీలింగ్స్ వద్దు: ఇన్వెస్టర్లకు యూఏఈ హెచ్చరిక
May 02, 2018
ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ అనే అన్ రెగ్యులేటెడ్ కంపెనీతో ఇన్వెస్టర్లు ఎలాంటి డీలింగ్స్ జరపవద్దని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ హెచ్చరించింది. అయితే ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ సంస్థ ఇప్పటిదాకా ఈ విషయమై తన స్పందనను తెలియజేయలేదు. యూఏఈ సహా ఆసియా, గల్ఫ్‌కి చెందిన పలు దేశాల్లోని ఇన్వెస్టర్లతో ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ కలిసి పనిచేస్తోంది. అయితే అన్ రెగ్యులేటెడ్ కంపెనీ కావడంతో ఈ సంస్థతో లావాదేవీలు ప్రమాదకరమని యూఏఈ తన హెచ్చరికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి లైసెన్స్ లేకపోయినా వందల వేల డాలర్స్‌ని ఆసియా ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నట్లుగా జనవరిలో రాయిటర్స్ పేర్కొంది.