ఈనెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం సమావేశం..

- June 23, 2018 , by Maagulf
ఈనెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం సమావేశం..

తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవడంపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఏఐసీసీ సంస్ధాగత ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, తెలంగాణ ఇంఛార్జ్‌ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాలుగున్నర గంటలు సమావేశం సాగింది. కొత్తగా నియమించిన ముగ్గురు కార్యదర్శులకు 40 నియోజవర్గాలు కేటాయించారు. ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపిక వంటి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. 90 రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి జిల్లా, బ్లాక్, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలకే ఎన్నికల కమిటీలు నియమించారని.. తెలంగాణలో లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంచేసింది. పార్టీలోని కుమ్ములాటలు, దానం జంపింగ్‌పైన వార్‌రూమ్‌లో చర్చించారు. నాయకులు వెళ్తున్నా.. 10శాతం ఓటు బ్యాంక్ పెరిగిందని కుంతియా అన్నారు. డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొచ్చినా కేడర్‌ని సిద్ధం చేయడమే కర్తవ్యమన్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి యాక్షన్‌ ప్లాన్‌ అమలు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com