తాగునీటి కోసం ఐస్‌బర్గ్‌పై కన్నేసిన యూఏఈ

- July 03, 2018 , by Maagulf
తాగునీటి కోసం ఐస్‌బర్గ్‌పై కన్నేసిన యూఏఈ

అంటార్కిటికా నుంచి ఐస్‌బర్గ్‌ని యూఏఈకి తీసుకొచ్చి, యూఏఈలో తాగు నీటి అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో వుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కీలకమైన ముందడుగు పడబోతోంది. 50 నుంచి 60 మిలియన్‌ డాలర్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్‌ సఫలమైతే, యూఏఈ నీటి అవసరాలు తీరిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ 2018లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. నేషనల్‌ అడ్వయిజర్‌ బ్యూరో లిమిటెడ్‌, ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టనుంది. గత ఏడాదిగా ఈ ప్రాజెక్ట్‌పై వర్క్‌ చేస్తున్నామనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మంచి వార్త చెప్పబోతున్నామని నేషనల్‌ అడ్వయిజర్‌ బ్యూరో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబ్దుల్లా మొహమ్మద్‌ సులైమాన్‌ అల్‌ షెహి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com