హజ్‌ నిర్వహించనున్న 5,625 మంది బహ్రెయినీలు

- August 12, 2018 , by Maagulf
హజ్‌ నిర్వహించనున్న 5,625 మంది బహ్రెయినీలు

శుక్రవారం 1.2 మిలియన్‌ మందికి పైగా ఫిలిగ్రిమ్స్‌ పవిత్ర ప్రదేశంలో హజ్‌ నిర్వహించేందుకు చేరుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి 7 శాతం ఫిలిగ్రిమ్స్‌ పెరిగారు. బహ్రెయిన్‌ హజ్‌ మిషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 5,625 మంది బహ్రెయినీ ఫిలిగ్రిమ్స్‌ ఈ ఏడాది హజ్‌ యాత్ర నిర్వహించబోతున్నారు. బహ్రెయినీ హజ్‌ కోటా 1000 పెరగడంతో ఈ మార్క్‌ని చేరుకుంది. బహ్రెయిన్‌ హజ్‌ మిషన్‌ హెడ్‌ షేక్‌ అద్నాన్‌ అల్‌ కత్తాన్‌ మాట్లాడుతూ, సౌదీ హజ్‌ అథారిటీస్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫిలిగ్రిమ్స్‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com