ప్రముఖ అమెరికన్ పాప్‌స్టార్ పట్ల బిషప్ అసభ్య ప్రవర్తన
- September 02, 2018
డెట్రాయిట్: ప్రముఖ అమెరికన్ పాప్‌స్టార్ ఆరియానా గ్రాండేకు చేదు అనుభం ఎదురైంది. అరేథా ఫ్రాంక్లిన్ అనే ప్రముఖ గాయని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. ఈ సందర్భంగా డెట్రాయిట్‌లో ఫ్రాంక్లిన్ పేరిట సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆరియానా..ఫ్రాంక్లిన్‌కు ఎంతో ఇష్టమైన ఓ పాట పాటను పాడారు. ఇందుకు ఆరియానాను మెచ్చుకుంటూ కార్యక్రమానికి హాజరైన చార్ల్స్ ఎల్లిస్ అనే బిషప్ ఆమెను అసభ్యంగా కౌగిలించుకున్నాడు.
దాంతో ఆరియానాతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ దృశ్యాలు కాస్తా అక్కడి మీడియా వర్గాలు రికార్డ్ చేయడంతో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంపై బిషప్ చార్ల్స్ స్పందిస్తూ.. ‘ఓ మహిళతో నేనెప్పుడూ అలా అసభ్యంగా ప్రవర్తించను. నాకు తెలీకుండానే అలా జరిగిపోయింది. బహుశా నేను హద్దులు మీరి ప్రవర్తించి ఉంటాను. ఆమెతో మరింత సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించి ఉంటాను. అందుకు నేను ఆరియానాను, ఆమె అభిమానులకు క్షమాపణను కోరుతున్నాను.’ అని వెల్లడించాడు చార్ల్స్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..