రికార్డు స్థాయిలో సమంత "కర్మ థీమ్"

- September 10, 2018 , by Maagulf
రికార్డు స్థాయిలో సమంత

వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి నటిగా కూడా ప్రశంసలు దక్కించుకుంటున్న హీరోయిన్ సమంత. తాజాగా ఆమె నటించిన చిత్రం 'యూటర్న్'. కన్నడ హిట్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంతాతోపాటు రాహుల్ అవీంద్రన్, భూమిక, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. `ది న్యూ డ్యాన్స్ ఆంథెమ్‌` పేరుతో విడుదలైన ఈ సాంగ్ లో సమంత అత్యద్భుతంగా డ్యాన్స్ చేసింది. కర్మ థీమ్ తో విడుదలైన ఈ పాటకు సంగీతం దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. శ్రీ సాయి సాహిత్యం అందించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `యూటర్న్‌`కు పవన్ కుమార్ దర్శకుడు.

తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నారు. `యూటర్న్` కర్మ థీమ్ సాంగ్ వీడియోకు తెలుగులో 7.2 మిలియన్ వ్యూస్ లభించగా, తమిళంలో 3.9 మిలియన్ల వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టిస్తోంది. ఈ కర్మ థీమ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ సస్పెన్సు థ్రిల్లర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com