'దేవదాస్' సినిమా ఆడియో విడుదల
- September 20, 2018
టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ దేవదాస్ . నాగార్జున, నాని ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కొద్ది రోజులుగా టీజర్, సాంగ్స్‌తో అలరించిన టీం నిన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ విడుదల చేసింది. 2:06నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే చిత్రం మొత్తం ఫుల్ కామెడీగా ఉంటుందని అనిపిస్తుంది. నాగ్ ,నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. దేవ పాత్రలో నాగార్జున, దాస్ పాత్రలో నానిలు సరికొత్త వినోదాన్ని అందించనున్నారని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి