అక్టోబర్ 11న విడుదల కి ముస్తాబవుతున్న అరవింద సమేత.!

- September 27, 2018 , by Maagulf
అక్టోబర్ 11న విడుదల కి ముస్తాబవుతున్న అరవింద సమేత.!

జూ.ఎన్టీఆర్‌కు సక్సెస్‌లు కొత్త కాకపోయినా సినీరంగంలో ట్రెండ్‌ మారిన నేపథ్యంలో ఏ సినిమాకు ఆ సినిమా విజయాన్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు. టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జై లవకుశ వంటి నాలుగు వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత (వీరరాఘవ ఉపశీర్షిక) చిత్రంపై కూడా భారీ అంచనాలతో ఉన్నారు. పైపెచ్చు త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల కలయికలో ఇది తొలి చిత్రం కావడం కూడా అంచనాలకు కారణమైంది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను.అలాగే తనదైన స్కూలును దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కు పూజాహెగ్డే జోడీ కట్టగా.హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఇటీవల స్విస్‌, ఇటలీ బోర్డర్‌లో ఈ చిత్రం కోసం ఓ పాటను చిత్రీకరించుకుని యూనిట్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది. ఈషా రెబ్బ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నవీన్‌చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఛాయాగ్రహణాన్ని పి.ఎస్‌.వినోద్‌, సంగీతాన్ని తమన్‌ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com