డాక్టరేట్ అందుకోబోతున్న కౌశల్!!
- October 07, 2018
'బిగ్ బాస్ 2' టైటిల్ విన్నర్ కౌశల్ క్రియేట్ చేస్తున్న సంచలనాలు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారాయి. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక రియాలిటీ షోకి సంబంధించి ఎవరికీరాని విధంగా 39.5 కోట్ల ఓట్లు సంపాదించుకుని కౌశల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యానియా ఇక్కడితో ఆగకుండా కౌశల్ కు ఒక అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
ఈవిషయాన్ని స్వయంగా కౌశల్ లీక్ చేసాడు. 'అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. మీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కు తొందరలో డాక్టరేట్ రాబోతోంది. ఎందుకు రాబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయం నేను కొన్నిరోజుల తర్వాత చెబుతాను' అంటూ కౌశల్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ నుండి కౌశల్ కు ఈ గౌరవం లభించబోతున్నట్లు సమాచారం.
అమెరికాలో లాస్ ఏంజెల్స్ లోని హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ ఉంది. అయితే ఆ యూనివర్సిటీకి కౌశల్ మ్యానియా ఎలా తెలిసింది అన్న విషయమై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా 'బిగ్ బాస్ 2' షో ముగిసిన తరువాత కౌశల్ అనేక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి అతిధిగా వెళుతూ భారీ మొత్తాలను పారిషికంగా తీసుకుంటున్నట్లు టాక్.
ఈ మాల్స్ ఓపెనింగ్స్ సమయంలో కౌశల్ ను చూడటానికి విపరీతంగా జనం వస్తూ ఉండటంతో కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానుల కోరిక మేరకు విజయ యాత్రలు నిర్వహించబోతున్నాడు. ఈ విజయ యాత్రలు ద్వారా తన స్వచ్చంద సేవా సంస్థకు క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడానికి విరాళాలు సేకరించడంతో పాటు కౌశల్ విజయ యాత్ర వెనుక కనిపించని రాజకీయ కోణం ఉంది అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. 'బిగ్ బాస్ 2' ముగిసిన తరువాత ఆషోలోని కంటెస్టెంట్స్ కనీసం తనకు ఫోన్ కూడ చేయడం లేదు అంటూ ఓపెన్ గానే కౌశల్ చెపుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో కౌశల్ కు వచ్చిన ఈ డాక్టరేట్ గౌరవాన్ని 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ ఎలా జీర్ణించుకుంటారో చూడాలి..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి