'అరవింద సమేత' కొత్త పోస్టర్ విడుదల

- October 09, 2018 , by Maagulf
'అరవింద సమేత' కొత్త పోస్టర్ విడుదల

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'అరవింద సమేత' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి థమన్ బాణీలు అందించారు. అక్టోబర్ 11 న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com