దుబాయ్‌ బీచ్‌లో స్పెషల్‌ రైడ్‌

- October 24, 2018 , by Maagulf
దుబాయ్‌ బీచ్‌లో స్పెషల్‌ రైడ్‌

థ్రిల్‌ కోరుకునేవారికి దుబాయ్‌ బీచ్‌లో మరో ఆకర్షణీయమైన రైడ్‌ అందుబాటులోకి వచ్చింది. యాక్షన్‌ స్పోర్ట్‌ బ్రాండ్‌ ఎక్స్‌ దుబాయ్‌ స్లింగ్‌ షాట్‌, కైట్‌ బీచ్‌లో అక్టోబర్‌ 26న అందుబాటులోకి వస్తుంది. ఓ వ్యక్తికి 280 దిర్హామ్‌ల ఖర్చుతో ఈ థ్రిల్‌ అందించనున్నారు. దీంతోపాటుగా 50 దిర్హామ్‌ల వోచర్‌ ఉచితంగా లభిస్తుంది. దీన్ని ఎక్స్‌ దుబాయ్‌ షాప్‌లో రిడీమ్‌ చేసుకోవచ్చు. సింగిల్‌ రైడర్స్‌ కోసం ఈ రైడ్‌ని డిజైన్‌ చేశారు. గురువారం, శుక్రవారం, శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 1 గంట నుంచి 7 గంటల వరకు మాత్రమే ఈ రైడ్‌ అందుబాటులో వుంటుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దుబాయ్‌ బీచ్‌లో ఇసుక మీదుగా, సముద్రం మీదుగా స్లింగ్‌ అవడం ఈ రైడ్‌ ప్రత్యేకత. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com