క్యాన్సర్‌పై పోరాటం: ఫండ్స్‌ కోసం వాకథాన్‌

- October 25, 2018 , by Maagulf
క్యాన్సర్‌పై పోరాటం: ఫండ్స్‌ కోసం వాకథాన్‌

మస్కట్‌: 15వ వార్షిక వాకతాన్‌, మస్కట్‌లో అక్టోబర్‌ 30న జరగనుంది. 10 వేల మంది ఈ ఏడాది జరిగే వాకథాన్‌లో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒమన్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌ (ఓసిఎ), ఈ వాకతాన్‌ని నిర్వహిస్తోంది. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా విరాళాల్ని సేకరించేందుకు అలాగే క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్‌ పేషెంట్స్‌, వారి బంధువులు, అలాగే క్యాన్సర్‌ని జయించినవారు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 15 ఏళ్ళ క్రితం తొలిసారిగా ఈ వాకథాన్‌ నిర్వహించినప్పుడు కేవలం 274 మంది మాత్రమే హాజరయ్యారని ఓసిఎ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వాహిద్‌ అల్‌ కురైసి చెప్పారు. 2017లో 8 వేల మంది పాల్గొనగా, ఈసారి 10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. క్యాన్సర్‌ వాకథాన్‌లో పాల్గొనాలనుకునేవారికి రిజిస్ట్రేషన్‌ ఫీజు 3.5 ఒమన్‌ రియాల్స్‌. వారికి టి షర్ట్‌ని అలాగే ఓ రఫాలె టిక్కెట్‌ని అందజేస్తారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com