ఇస్రో విజయం : రాకెట్ సక్సెస్.. కక్ష్యలోకి శాటిలైట్లు

- November 29, 2018 , by Maagulf
ఇస్రో విజయం : రాకెట్ సక్సెస్.. కక్ష్యలోకి శాటిలైట్లు

నెల్లూరు: పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం జరిగింది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.58 గంటలకు రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. భారత్ కు చెందిన హైసిస్ ను పీఎస్ఎల్ వీ-సీ43 రాకెట్ కక్ష్యలోప్రవేశపెట్టింది. భూఉపరితల పరిశీలనలో హైసిస్ కీలకంగా వ్యవహరించనుంది. అడవులు, సముద్రగర్భంలోని పరిస్థితులను హైసిస్ పరిశీలించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిన్న ఉదయం 5.58 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగాక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 

పీఎస్‌ఎల్‌వీ సి-43 ద్వారా నింగిలోకి 31 ఉపగ్రహాలు 
పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌(హెచ్‌వైఎస్‌ఐఎస్‌)ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పీఎస్‌ఎల్‌వీ ప్రవేశ పెట్టనుంది. ఇందుకుగాను రాకెట్‌లోని నాలుగో దశను రెండుసార్లు మండించారు. మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం(హెచ్‌వైఎస్‌ఐఎస్‌) బరువు 380 కిలోలు. 'ఆప్టికల్‌ ఇమేజింగ్‌ డిపెక్టర్‌ ఆరె చిప్‌' ఇందులో ఉంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు రూపొందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ప్రయోగశాల తయారు చేశారు. 

630 కిమీ దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలు.. 
630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com