మిడిల్‌ ఈస్ట్‌లో అత్యంత వేగవంతమైన స్నేక్‌

- December 24, 2018 , by Maagulf
మిడిల్‌ ఈస్ట్‌లో అత్యంత వేగవంతమైన స్నేక్‌

మస్కట్‌: షోకారి శాండ్‌ రేసర్‌.. మిడిల్‌ ఈస్ట్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే స్నేక్‌ ఇది. ఒమనీ ఫొటోగ్రాఫర్‌ మొహమ్మద్‌ అల్‌ మషాని ఈ పాముని వీడియో తీశారు. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో అల్‌ మషాని కంట పడింది ఈ స్నేక్‌. మీటరు పొడవు వుండే ఈ స్నేక్‌, అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనీ, తన కెమెరాకు చిక్కడం చాలా ఆనందంగా వుందని అల్‌ మషాని చెప్పారు. విషపూరితమైన స్నేక్స్‌లో ఇది కూడా ఒకటి. స్నేక్‌ పై భాగంలో నాలుగు చారలు ఈ స్నేక్‌కి ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న పక్షలు, ఎలుకలు ఈ స్నేక్‌ ఆహారం. తన వేగంతో, వాటిని వేటాడి ఆరగిస్తుంది శాండ్‌ రేసర్‌ షోకారి. ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఈ స్నేక్‌ సంచరిస్తుంటుంది. అగ్రికల్చరల్‌ ఏరియాస్‌లో చాలా అరుదుగా కన్పిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com