అతిలోక సుందరి వర్ధంతికి ఏర్పాట్లు

- February 09, 2019 , by Maagulf
అతిలోక సుందరి వర్ధంతికి ఏర్పాట్లు

అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలో ముంచింది. ఆమె మరో లోకానికి వెళ్లి అప్పుడే ఏడాది కావోస్తుంది. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి అనూహ్య పరిస్థితుల్లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించడం అత్యంత విషాదంగా మారిన విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రథమ వర్ధంతి రోజున నివాళులర్పించడానికి శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవీ ప్రథమ వర్ధంతిని ఎప్పుడు? ఎక్కడ చేస్తున్నారంటే..
 
దివంగత శ్రీదేవి ప్రథమ వర్ధంతిని చెన్నైలోని తన నివాసంలో ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోనికపూర్, జాహ్నవి, కుషీ కపూర్, అనిల్ కపూర్ సతీమణి సునీత, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక పూజలో వారు పాల్గొంటారు. శ్రీదేవి ప్రథమ వర్ధంతికి దక్షిణాది, హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. శ్రీదేవికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా ఈ పూజలో పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎవరు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేకపోయింది.
 
శ్రీదేవికి చెన్నై నగరంతో ఎంతో అనుబంధం ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు తిరిగి రావాలని కోరుకొనేది. కానీ విధిరాత వల్ల అది సాధ్యపడలేదు. నా భార్య ఆకాంక్షలను నెరవేర్చడానికే పింక్ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నాను. దీంతో శ్రీదేవి ఆత్మకు మరింత శాంతి చేకూరుతుందని భావిస్తున్నాం అని బోనికపూర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com