భారత్ కు చేజారిన టీ20 సిరీస్
- February 10, 2019
న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కోల్పోయింది.
మొదటి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లను న్యూజీలాండ్ జట్టు గెల్చుకుంది.
ఆదివారం హమిల్టన్‌లో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
కాలిన్ మన్రో 20 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 72 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి అత్యధికంగా 54 పరుగులు ఇచ్చాడు.
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
యువ ఆటగాడు వి శంకర్ 28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 38 పరుగులు చేయగా.. మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ 12 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు చేశాడు.
దినేశ్ కార్తీక్ 16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు, కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు చేసినా జట్టుకు విజయం లభించలేదు.
చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా భారత్ 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బాల్‌కు దినేశ్ కార్తీక్ సిక్సర్ కొట్టాడు.
వికెట్ కీపర్ ధోనీ (2 పరుగులు), ఓపెనర్ శిఖర్ ధావన్ (5 పరుగులు) నిరాశపర్చారు.
కాలిన్ మన్రోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్, టిమ్ సీఫెర్ట్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..