బెంగళూరులో మిస్సైన ఇంజనీరింగ్ స్టూడెంట్ హైదరాబాద్ లో విగతజీవిగా లభ్యం!
- December 24, 2019
హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూరులో మాయమైన ఓ ఇంజనీరింగ్ కాలేజి యువకుడు హైదరాబాద్ లో శవమై తేలాడు. ఈ ఘటన ఇరు రాష్ట్రాల రాజధానుల్లో కలకలం రేపుతోంది.
ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన సుమిత్ శ్రీవాస్తవ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతడు కొద్దిరోజుల క్రితం ఇంటినుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే అతడు తాజాగా హైదరాబాద్ లో శవమై తేలాడు. నగర శివారులోని శంషాబాద్ లో ఓయో హోటల్లో సోమవారం సాయంత్రం దిగాడు. ఉదయాన్నే హోటల్ సిబ్బంది రూంసర్వీస్ కోసం వెళ్లగా తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమాచారంలో హోటల్ వద్దకు చేరుకున్న శంషాబాద్ పోలీసులు హోటల్ సిబ్బందివద్ద మరో తాళంతో రూంలోకి ప్రవేశించారు. అప్పటికే శ్రీవాస్తవ బెడ్ పై విగతజీవిగా పడివున్నాడు.
దీంతో వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తే ప్రారంభించారు. అతడి వద్ద దొరికిన వస్తువుల ఆధారంగా బెంగళూరు వాసిగా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడిపై మిస్సింగ్ కేసు నమోదయి వున్నట్లు బయటపడింది.
బెంగళూరు పోలీసులు అంధించిన వివరాల ఆధారంగా ఈ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







