పెడెస్ట్రియన్‌ క్రాసింగ్‌ ఉల్లంఘన: 500 దిర్హామ్‌ల జరీమానా

- December 24, 2019 , by Maagulf
పెడెస్ట్రియన్‌ క్రాసింగ్‌ ఉల్లంఘన: 500 దిర్హామ్‌ల జరీమానా

అబుదాబీ పోలీస్‌, సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేయడం జరిగింది. జీబ్రా క్రాసింగ్‌ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనాలపై జరీమానా విధించే అంశానికి సంబంధించి ఈ వీడియోలో స్పష్టతనిచ్చారు. ఓ ఎస్‌యూవీ, పెడెస్ట్రియన్‌ క్రాసింగ్‌పై పాదచారులకు అవకాశం ఇవ్వకపోగా, దాని వెనుక వున్న వాహనం మాత్రం, పాదచారులకు గౌరవాన్నిచ్చింది. పాదచారులకు అవకాశమివ్వని వాహనంపై 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తున్నట్లు అబుదాబీ పోలీస్‌ పేర్కొంది. అలాగే ఈ ఉల్లంఘనకు 6 బ్లాక్‌ పాయింట్స్‌ని అదనంగా జోడిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com