షార్జా: త్వరలోనే క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం..షార్జా రూలర్ ప్రకటన
- February 27, 2020
షార్జాలో ఈ మార్చి నాటికి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించబోతున్నట్లు రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ప్రకటించారు. పింక్ కారవాన్ రైడ్ పదవ ఎడిషన్ ను జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ నివారణకు ముందస్తుగా గుర్తించటం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటం పింక్ కారవాన్ రైడ్ లక్ష్యం.
ఈ సందర్భంగా రూలర్ మాట్లాడుతూ షేక్ జవహర్ బింట్ మొహమ్మద్ అల్ ఖాసిమి చేపట్టిన గ్లోబల్ ఎఫెర్ట్స్ లో భాగంగా క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడు ఎమిరేట్స్‌లో 350 మంది వైద్యులు, వైద్య నిపుణులు, 150 మంది రైడర్లు, 100 మందికి పైగా వాలంటీర్లు ఏడు ఎమిరేట్స్ పరిధిలోని 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. రొమ్ము క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తుగానే గుర్తించటం ఎంతో కీలకమని క్యాంపేయిన్ చేయనున్నారు. ప్లేంటీ ఈజ్ నాట్ ఇనఫ్ పేరుతో చేపట్టిన ఈ క్యాంపేన్ ద్వారా 10 వేల మందికి 7 ఫిక్స్ డ్ క్లినిక్స్ లో ఫ్రీ స్క్రీనింగ్ నిర్వహించాలని టార్గెట్ గా నిర్దేశించుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







