కరోనా కట్టడికి మోదీ కీలక నిర్ణయం…
- March 23, 2020
ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఇండియాలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించగా.. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు కరోనా పరీక్ష సామర్ధ్యాన్ని పెంచుతూ.. దేశవ్యాప్తంగా 12 డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు కరోనా పరీక్షలకు అనుమతినిచ్చింది. వీటితో పాటు మరో 15,000 కలెక్షన్ సెంటర్లకు కూడా అనుమతులు జారీ చేసింది. దీనితో ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రావడంతో కరోనా పరీక్షల సామర్ధ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు కోవిడ్ 19 కారణంగా ఇప్పటికే 19 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. అటు ఆరు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు షట్ డౌన్ అయ్యాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి.. అన్నీ సర్వీసులు బంద్ కానున్నాయని ఆ రాష్ట్ర సీఎం పళణి స్వామి వెల్లడించారు. అటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైనా దిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
అటు దేశీయ విమాన సర్వీసులను కూడా రేపటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. అయితే కార్గో విమాన సర్వీసులు మాత్రం యధాతధంగా నడుస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







