కాబూల్:గురుద్వార పై దాడి చేసిన ఉగ్రవాది కేరళ వాసా?

- March 27, 2020 , by Maagulf
కాబూల్:గురుద్వార పై దాడి చేసిన ఉగ్రవాది కేరళ వాసా?

ఢిల్లీ:బుధవారం కాబూల్‌లో గురుద్వారపై దాడి చేసి 25 మంది సిక్కులను చంపిన దళాలలో ఒక భారతీయ ఉగ్రవాది కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గురుద్వారా హర్ రాయ్ సాహిబ్‌పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరిని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) 'అబూ ఖలీద్ అల్-హిందీ' అని పేర్కొంది.

మార్చి 26 న ఐఎస్ ప్రచార పత్రిక అల్ నాబాలో ప్రచురించిన ఛాయాచిత్రంలో ఉగ్రవాది టైప్ 56 అటాల్ట్ రైఫిల్ పట్టుకొని, ఒక వేలుతో సెల్యూట్‌లో వేలు చూపిస్తూ ఉంటాడు.. వాస్తవానికి ఈ ఉగ్రవాది గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో మరణించినట్లు భావిస్తున్న ఉగ్రవాది ముహమ్మద్ ముహ్సిన్ (21) అని అతను కేరళకు చెందిన వ్యక్తిగా పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇండియా టుడే కు తెలిపాయి. కాసర్గోడ్ జిల్లాలోని త్రికరిపూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ముహ్సిన్ గత ఏడాది జూన్ 18 న డ్రోన్ దాడిలో మరణించాడు. మరి ఈ చిత్రం నిజమా కాదా? ఒకవేళ నిజమైతే అప్పుడు మరణించిన వ్యక్తి ఎవరు అనేది క్లారిటీ రావలసి ఉంది.

నిజానికి ముహ్సిన్ దుబాయ్ నుండి ఆఫ్ఘనిస్తాన్లోని ఐఎస్ శిబిరాలకు వలస వెళ్ళాడు, అక్కడ అతను టెలిగ్రామ్ గ్రూపులో క్రియాశీల సభ్యుడిగా పనిచేస్తున్నాడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) కోజికోడ్ ఇంజనీర్ షజీర్ మంగలసేరి ద్వారా దుబాయ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళాడు. అయితే జూన్, 2017 లో ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా డ్రోన్ దాడిలో మంగళసిరి మృతి చెందింది. కాగా మార్చి 25 న ఉదయం 7.45 గంటలకు గురుద్వారాలో 200 మంది ఆరాధకులపై ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి గ్రెనేడ్లను విసిరారు.. దాంతో 25 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com