కరోనా అలర్ట్:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈ మొబైల్ సర్వీస్ కొనసాగింపు
- March 28, 2020
యూఏఈ:డాక్యుమెంట్ల గడువు ముగిసినా యూఏఈలో మొబైల్ సర్వీసులను రద్దు చేయొద్దని టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు కంపెనీలను ఆదేశించారు.ఎమిరాతి గుర్తింపు పత్రం గడువు కాలం ముగిసినా..మొబైల్ సేవలకు కావాల్సిన డాక్యుమెంట్లు లేకపోయినా మొబైల్ సేవలను మాత్రం రద్దు చేయవద్దని సూచించింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికమ్యూనికేషన్ నియంత్రణ అధికారులు తెలిపారు. గుర్తింపు పత్రాల రెన్యూవల్, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించేందుకు టెలికమ్యూనికేషన్ ఆఫీసులకు వెళ్లే వినియోగదారులను నియంత్రించటం లక్ష్యంగా ఈ వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







