దుబాయ్ : కరోనా నేపథ్యంలో యూఏఈ వీసా గడువు పొడిగింపు సాధ్యామేనా?

- April 16, 2020 , by Maagulf
దుబాయ్ : కరోనా నేపథ్యంలో యూఏఈ వీసా గడువు పొడిగింపు సాధ్యామేనా?

కరోనా నేపథ్యంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పర్యాటకులు, ప్రవాసీయుల వీసా గడువును పొడిగిస్తున్నట్లు యూఏఈ ఇప్పటికే ప్రకటించింది. ప్రవాసీయుల వీసా, ఎమిరాతి ఐడీ, పర్యాటకుల ఎంట్రీ పర్మిట్ లు అటో మెటిక్ గా ఈ ఏడాది చివరినాటికి పొడిగించబడుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే..మార్చి 1 నాటికి గడువు ముగిసిన వీసాలు మళ్లీ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరంగానీ, రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరంగానీ ఉండదు.

పౌర వ్యవహారాలు, గుర్తింపు నిర్వహణ కేంద్ర అధికార విభాగం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఖమిస్ అల్ కాబి..అబుదాబి రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీసా గడువు పెంపు విధివిధానాల గురించి వివరించారు. వీసా గడువు పొడిగించే ప్రాసెస్ ఏంటీ? డాక్యుమెంట్లు ఏమైనా అవసరమా? అనే వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం....

1. కాలపరిమితి ముగిసిన వీసా గడువు పొడిగించుకోవటం ఎలా?
బిగేడియర్ అల్ కాబి : మార్చి 1 నాటికి ప్రవాసీయుల రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా..వాటి కాలపరిమితి అటోమెటిగ్గా డిసెంబర్ 2020 వరకు పొడిగించబడుతుంది. ఇందుకోసం మళ్లీ డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఆఫీసుకు వెళ్లి రెసిడెన్సీ వీసా రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

2. మార్చి 1తో గడువు ముగిసినా ఎమిరాతి ఐడీస్ తో ప్రభుత్వ సంస్థలు, బ్యాంకు లావాదేవీలకు ఉపయోగించొచ్చా?
బిగేడియర్ అల్ కాబి : నిస్సందేహంగ. యూఏఈ మంత్రిమండలి ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా..మార్చి 1 నాటితో గడువు ముగిసిన ఎమిరాతి గుర్తింపు కార్డులు ఇక ముందు కూడా చెల్లుబాటులోనే ఉంటాయి. ఈ ఏడాది చివరి వరకు బ్యాంకు లావాదేవీల్లో, ప్రభుత్వ కార్యాకలాపాలకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు కార్డులు నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రవాసీయులతో పాటు ఎమిరాతీస్ కి కూడా వర్తిస్తుంది.

3. 6 నెలలుగా దేశం వెలుపల ఉన్న ప్రవాసీయుల వీసా రద్దవుతుందా?
బిగేడియర్ అల్ కాబి : యూఏఈలో ఉన్నా..విదేశాల్లో ఉన్నాసరే ప్రవాసీయుల వీసా గడువు పెంచాలని ఇప్పటికే నిర్ణయించాం. ఆరు నెలలే కాదు..అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నా ప్రవాసీయుల రెసిడెన్సీ వీసాలు రద్దు చేయరు.

4. విజిట్ వీసా, ఎంట్రీ పర్మిట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?
బిగేడియర్ అల్ కాబి : మార్చి 1తో గడువు ముగిసిన విదేశీలయుల విజిట్ వీసాలు, అన్ని రకాల ఎంట్రీ పర్మిట్ ల కాలపరిమితి ఈ ఏడాది చివరి నాటికి అటోమెటిగ్గా పొడిగించబడతాయి.

5. గడువు ముగిసినా ఎక్కువ రోజులు యూఏఈలోనే ఉన్న ప్రవాసీయులపై జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయా?
బిగేడియర్ అల్ కాబి : లేదు. అలాంటి అవకాశమే లేదు. కాలపరిమితి పెంచుతూ ప్రవాసీయుల వీసాలపై ఎలాంటి స్టాంపులు లేకున్నా జరిమానాలు ఉండవు.

6. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
బిగేడియర్ అల్ కాబ: స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటున్న ప్రవాసీయుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయటంతో ఆయా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనిపై స్పష్టమైన వివరాలను కొద్ది రోజుల్లోనే వెల్లడిస్తాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com