కోవిడ్ 19: కార్మికులు కదలికలపై కొత్త ఆంక్షలు విధించిన షార్జా అధికారులు
- April 16, 2020
షార్జాలోని కార్మికులు ఇతర ఎమిరాతిస్ కు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. కార్మికుల కదలికలపై ఆంక్షలు విధిస్తూ షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఇక నుంచి కార్మికులు షార్జా దాటి బయటికి వెళ్లటానికి వీలు లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ ఛైర్మన్ వెల్లడించారు. కార్మికులు, షార్జా పౌరుల ఆరోగ్య భద్రత తమ లక్ష్యమని వివరించారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను ఖాతరు చేయకుంటే వారిపై జరిమానా విధిస్తామని కూడా చైర్మన్ హెచ్చరించారు. అయితే..క్లీనింగ్, ఆహార సరఫరా, ప్రైవేట్ సెక్యూరిటీ రంగాల్లోని పని చేసే కార్మికులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే కార్మికులు తరలించే సమయంలో రవాణ వాహనంలోని సామార్ధ్యానికి సగానికి మాత్రమే కార్మికులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్మికులు తప్పసరిగా మాస్కులు ధరించటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూడా షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







