యూఏఈ : జాత్యాహంకార ప్రసంగం చేసిన మీడియా వ్యక్తికి రిమాండ్

- April 16, 2020 , by Maagulf
యూఏఈ : జాత్యాహంకార ప్రసంగం చేసిన మీడియా వ్యక్తికి రిమాండ్

యూఏఈ:ఓ వర్గాన్ని కించపరుస్తూ జాత్యాహంకార ప్రసంగం చేసిన వ్యక్తికి రిమాండ్ కు తరలించారు.  యూఏఈకి చెందిన ఓ మీడియాలో పని చేస్తున్న టీఎం అనే వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోపై ఫిర్యాదులు రావటంతో యూఏఈ ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు తన ప్రసంగంలో జాత్యాహంకారం ప్రస్పుటించటమే కాకుండా ఓ వర్గాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది యూఏఈ ప్రధామిక సూత్రమైన సమానత్వ భావనకు విరుద్ధంగా ఉందని కోర్టు అభిప్రాపడింది.  నిందితుడిపై ఉన్న ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది..న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికార ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియా వేదికగ గానీ, మరే ఇతర మాధ్యమంలోనైనా సరే జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com