కరోనా క్రైసిస్‌: ఎంప్లాయర్‌ తన వద్ద ఎంప్లాయీ పాస్‌పోర్ట్‌ వుంచుకోవచ్చా?

- April 20, 2020 , by Maagulf
కరోనా క్రైసిస్‌: ఎంప్లాయర్‌ తన వద్ద ఎంప్లాయీ పాస్‌పోర్ట్‌ వుంచుకోవచ్చా?

ప్రశ్న: నా పాస్‌పోర్ట్‌ని నా ఎంప్లాయర్‌ తన వద్ద వుంచుకున్నారు. నన్ను మాత్రం విధుల నుంచి తొలగించారు. పాస్‌పోర్ట్‌ అడిగితే, యూఏఈ నుంచి బయటకు వెళ్ళిపోతేనే పాస్‌పోర్ట్‌ ఇస్తానని చెబుతున్నారు. ఇన్‌బౌండ్‌, ఔట్‌బౌండ్‌ ప్రయాణీకుల విమానాలు లేనప్పుడు ఎంప్లాయర్‌(యజమాని), ఎంప్లాయీ(ఉద్యోగి) పాస్‌పోర్ట్‌ని వుంచుకోవచ్చా.?

సమాధానం: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ (MOI,UAE) జారీ చేసిన సర్క్యులర్‌ 262 - 2002 ప్రకారం, ఎంప్లాయర్స్‌, ఎంప్లాయీస్‌ పాస్‌పోర్ట్‌ని తమ వద్ద వుంచుకోవడం నిషిద్ధం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అలా చేయడానికి వీలుంటుంది. ఒకవేళ ఎంప్లాయీ(ఉద్యోగి) ఉద్దేశ్యపూర్వకంగా ఎంప్లాయర్‌(యజమాని) వద్ద పాస్‌పోర్ట్‌ వుంచితే అది నేరం కాదు. దీనికి సంబంధించి రాతపూర్వకమైన కన్సెంట్‌ని ఎంప్లాయీ, ఎంప్లాయర్‌కి ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీ ఎంప్లాయర్‌ గనుక మీ పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే, మినిస్ట్రీ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి ఆస్కారం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com