కరోనా వైరస్: 52,000 జరీమానాలు జారీ చేసిన దుబాయ్ పోలీస్
- April 28, 2020
దుబాయ్ పోలీస్ మొత్తం 52,069 జరీమానాల్ని ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది. నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా నిబంధనల్ని ఉల్లంఘించినవారికి ఈ జరీమానాలు విధించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 మధ్య మొత్తం 45,654 హెచ్చరికలు, 6,424 జరీమానాలు విధించారు. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినవారి విషయంలో 38,702 జరీమానాలు విధించడం జరిగింది. మెడికల్ మాస్క్‌లు వినియోగించని 10,286 మందికి కూడా జరీమానాలు విధించారు. వాహనంలో ముగ్గురికంటే ఎక్కువమంది ప్రయాణించడంతో 3,696 జరీమానాలు విధించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ప్రైవేట్ దేరింగ్స్కి పాల్పడితే 10,000 దిర్హావ్‌ుల జరీమానా విధిస్తారు. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 5,000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు. ఫిజికల్ డిస్టెన్స్ మెజర్స్ పాటించకపోతే 1,000 దిర్హామ్‌ల జరీమానా. మాస్క్‌లు ధరించనివారికి 1,000 దిర్హామ్‌ల జరీమానా. వాహనంలో ముగ్గురికంటే ఎక్కువమంది ప్రయాణిస్తే 1,000 దిర్హామ్‌ల జరీమానా.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







