దుబాయ్ డ్రాగన్ మార్కెట్ పునఃప్రారంభం
- May 01, 2020
దుబాయ్ డ్రాగన్ మార్ట్ పునఃప్రారంభమయ్యింది. నఖీల్ మాల్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రాగన్ మార్ట్‌కి చెందిన అన్ని షాప్స్ ప్రారంభమయ్యాయనీ, తాజా డైరెక్టివ్స్ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఔట్‌లెట్స్ (సినిమా, రూఫ్ టాప్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్యాబీ లాండ్ వంటివి) మాత్రం మూసివేయబడే వుంటాయని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజూ డ్రాగన్ మార్ట్ తెరిచే వుంటుంది. సూపర్ మార్కెట్ ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే వుంటుంది. నఖీల్ మాల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డ్రాగన్ మార్ట్ ఓనర్ మరియు ఆపరేటర్ అయిన ఒమర్ ఖూరీ మాట్లాడుతూ, రీజియన్‌లో వినియోగదారులకు సంబంధించి అమితంగా ఇష్టపడే షాపింగ్, ట్రేడింగ్ డైనింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో డ్రాగన్ మార్ట్‌కి ఎంతో ప్రత్యేకత వుందనీ, కరోనా వైరస్ నేపత్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్ని రోజులు మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు. భద్రత పరంగా కుట్టదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







