బహ్రెయిన్:అనుమతి లేకుండా ప్రయాణికుల రవాణా..ఆసియా వ్యక్తి అరెస్ట్

- May 12, 2020 , by Maagulf
బహ్రెయిన్:అనుమతి లేకుండా ప్రయాణికుల రవాణా..ఆసియా వ్యక్తి అరెస్ట్

మనామా:సరైన అనుమతులు లేకుండా ప్రయాణికులను ఎక్కించుకువెళ్తున్న ఆసియా వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తర్వాత రిమాండ్ కు తరలించారు. కేసును కోర్టు ట్రయల్ కు సిఫార్సు చేశారు అధికారులు. 46 ఏళ్ల ఆసియా వ్యక్తి డబ్బులు తీసుకొని ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లు ఓ బహ్రెయినీ సోషల్‌ మీడియాలో వీడియో షేర్ చేయటంతో..వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యూవల్ కోసం ఆలి డ్రైవింగ్ స్కూల్‌ కు వచ్చిన బహ్రెయిన్‌ వ్యక్తి మనామా వెళ్లేందుకు అక్కడే వాహనం కోసం ఎదురుచూస్తున్నాడు. అతని దగ్గరికి వచ్చిన ఆసియా వ్యక్తి ఎక్కడికి వెళ్లాలని ఆరా తీసి తనతో మనమా రావొచ్చని తెలిపాడు. అందుకు BD3 ఛార్జ్‌ అవతుందన్నాడు. అనుమానం వచ్చిన బహ్రెయిన్‌ వ్యక్తి ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడు. తనను ఎలా వాహనం దగ్గరికి తీసుకెళ్లింది..డ్రైవర్‌ తరహాలో డోర్‌ తీసింది..అంతా కెమెరాలో బంధించాడు. తాను వాహనంలో ఎక్కే సమయానికే వెనక సీట్లో మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నట్లు బహ్రెయిన్‌ వ్యక్తి చెబుతున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత వాహనం నెంబర్‌ ప్లేటుతో సహా అనుమతి లేకుండా ఆసియా వ్యక్తి ప్రయాణికులను ఎలా తీసుకువెళ్తున్నాడో వివరిస్తూ సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేశాడు. అతనిపై చర్య తీసుకోవాలంటూ ట్రాఫిక్‌ డీజీకి మెసేజ్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో తర్వాత ఐదు గంటల్లోనే ఆసియా వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com