ఆంధ్ర ప్రదేశ్ లో క్వారంటైన్ వివరాలు వివరిస్తున్న APNRTS ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్

- May 12, 2020 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ లో క్వారంటైన్ వివరాలు వివరిస్తున్న APNRTS ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్

విజయవాడ: విదేశాల నుండి తిరిగివస్తున్న వారి కోసం చేపడుతున్న చర్యలను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వందే భారత్ మిషన్ ద్వారా విమానాలు ఏర్పాటు చేసి, చాలామంది భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అధిక సంఖ్యలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం విమానాశ్రయాలకు వస్తున్నారు. అయితే వచ్చే వారం మే 16 నుండి 22 వరకు ఉన్న షెడ్యూల్ లో నేరుగా ఏపీ లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారికోసం చేయవలసిన అన్ని ఏర్పాట్లను, తీసుకోవలసిన చర్యలను కృష్ణ బాబు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కోవిడ్-19 టాస్క్ ఫోర్సు చైర్మన్ ఆధ్వర్యం లో, కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం, ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయము తో జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఉచిత క్వారంటైన్ కేంద్రాలను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడంతో పాటు పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలలో ఉండాలనుకుంటున్న వారి కొరకు జిల్లా స్థాయిలో 3 స్టార్ హోటల్స్ తో మాట్లాడి క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com