సౌదీ:ఈద్ సెలవుల సమయంలో 24 గంటల కర్ఫ్యూ అమలు
- May 13, 2020
సౌదీ:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈద్ అల్ ఫితర్ సెలవు రోజుల్లో కర్ఫ్యూ సమయాన్ని పొడిగించింది. దీంతో సెలవులు ఉండే ఆ 5 రోజుల పాటు సౌదీలో 24 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర మక్కా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఆదేశాలను అమలు చేయనున్నారు. అయితే..అప్పటివరకు దేశంలోని అన్ని షాపులు, వ్యాపార కార్యాకలాపాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగొచ్చు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







