అబుధాబి:ఎమిరాతీలకు, ప్రవాసీయులకు ఉచిత కరోనా టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం

- May 13, 2020 , by Maagulf
అబుధాబి:ఎమిరాతీలకు, ప్రవాసీయులకు ఉచిత కరోనా టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం

అబుధాబి:కరోనా వైరస్ కట్టడికి అబుధాబి అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేయనున్నారు. అబుధాబిలోని ఎమిరాతీలతో పాటు వారి ఇళ్లలో పని చేసే కార్మికులకు ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. దీంతో వచ్చే వారం నుంచి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రవాసీయులకు కూడా ఫ్రీ టెస్టులు చేయనున్నారు. అలాగే గర్భిణిలకు, 50 ఏళ్లు పైబడిన వారికి, కరోనా పాజిటివ్ వ్యక్తులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే...వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేసిన యూఏఈ ఇప్పటివరకు 13 లక్షల మందికి టెస్టులు నిర్వహించింది. అంటే ప్రతి పది మందిలో ఒక్కరికి పరీక్షలు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com