ఫార్మ్‌ ఓనర్స్‌కి ఖతార్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సూచనలు

- May 14, 2020 , by Maagulf
ఫార్మ్‌ ఓనర్స్‌కి ఖతార్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సూచనలు

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ - యానిమల్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌, ఫార్మ్లో పనిచేసే కార్మికులు ఖచ్చితంగా ఓనర్‌ స్పాన్సర్‌షిప్‌ కలిగి వుండాలనీ లేదా ఎస్టాబ్లిష్‌మెంట్‌తో స్పాన్సర్‌ షిప్‌ కలిగి వుండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లైసెన్స్‌ హోల్డర్స్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ఉల్ల:ఘనకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరించారు. కాగా, దోహా మునిసిపాలిటీకి చెందిన హెల్త్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌, అల్‌ దఫ్నా డిస్ట్రిక్ట్‌లోని ఓ పెద్ద కమర్షియల్‌ కాంప్లెక్స్‌కి సంబంధించిన గూడ్స్‌ రిసీప్ట్‌ ఏరియాని మూసివేసింది. ఫుడ్‌ చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు సదరు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి.

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com