భారతీయుల రీపాట్రియేషన్: కేంద్రాన్ని ఆశ్రయించాలన్న సుప్రీంకోర్టు
- May 16, 2020
కువైట్‌లో రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను వినియోగించుకోగలుగుతున్నా, స్వదేశానికి చేరలేక ఇబ్బందులు పడుతున్నారు కొందరు భారత వలసదారులు. వారిని స్వదేశానికి రప్పించాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయ్యింది. పూర్తి వివరాలతో పిటిషనర్, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ దారుడికి సూచించింది. కువైట్‌లో ఆమ్నెస్టీ పొందిన నలుగురు భారత పౌరుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషన్ దారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సమస్యలేర్పడ్డాయి. మరోపక్క, వివిధ దేశాల్లో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి రప్పించేందుకు దశలవారీ కార్యక్రమాలు చేపడుతోంది భారత ప్రభుత్వం. మే 6 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







