కువైట్:జనవరి 2020తో గడువు ముగిసిన నివాస అనుమతి రెన్యూవల్ సులభతరం
- May 16, 2020
కువైట్:కరోనా వైరస్ కారణంగా నివాస అనుమతుల రెన్యూవల్ ను సులభతరం చేసింది కువైట్ ప్రభుత్వం. జనవరి 2020 నాటితో గడువు ముగిసిన నివాస అనుమతులను జరిమానా చెల్లించి రెన్యూవల్ చేసుకోవచ్చని వెల్లడించింది. జరిమానా చెల్లించిన తర్వాత దర్యాప్తు అధికారుల సిఫార్సు లేకుండానే రెన్యూవల్ కు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో ఇక కంపెనీలే నేరుగా తమ ఉద్యోగులకు నివాస అనుమతులు రెన్యూవల్ చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు ఎంతో ప్రయోజనం కలగనుంది. కంపెనీల్లో రిజిస్టర్ అయిన ప్రవాస ఉద్యోగుల పేరు మీద ఆయా కంపెనీలు జరిమానా చెల్లిస్తే సరిపోతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







