ఏపీ:కొత్తగా 1,322 కరోనా కేసులు
- July 06, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 239కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,860 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







