తెలంగాణలో కొత్తగా 1879 కరోనా కేసులు, 7 మరణాలు
- July 07, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన గంటల్లో 1,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 27,612 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 313 మంది కరోనా సోకి చనిపోయారు. ఇంకా 11,012 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.తాజాగా 1,506 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 16,287 మంది డిశ్చార్జి అయ్యారు.
మంగళవారం GHMC పరిధిలో 1,422 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, సంగారెడ్డిలో 9, కరీంనగర్‌లో 32, మహబూబ్‌నగర్‌లో 11, కామారెడ్డిలో 7, గద్వాల్‌లో 4, నల్గొండలో 31, వరంగల్ అర్బన్‌లో 13, నిజామాబాద్‌లో 19, వికారాబాద్‌లో 1, మెదక్‌లో 12, పెద్దపల్లిలో 3, సూర్యాపేటలో 9, ఖమ్మంలో 3, జగిత్యాలలో 2, మహబూబాబాద్‌లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 6, భద్రాద్రి కొత్తగూడెంలో 3, రాజన్న సిరిసిల్లలో 2, ఆదిలాబాద్‌లో 1, జనగాంలో 1, ములుగులో 12, నాగర్ కర్నూల్ లో 2, వనపర్తిలో 1, సిద్దిపేటలో ఒక్క కేసు నమోదు అయింది. మంగళవారం 6220 శాంపిల్స్ సేకరించగా.. 4341 మందికి నెగిటివ్ వచ్చింది. ఇప్పటివరకూ 1,28, 438 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా వారిలో 1,00,826 మందికి నెగిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







