వీసా,గుర్తింపు కార్డు నిబంధనలను సవరించిన యూఏఈ

- July 11, 2020 , by Maagulf
వీసా,గుర్తింపు కార్డు నిబంధనలను సవరించిన యూఏఈ

 యూఏఈ:గుర్తింపు కార్డుల జారీ, జాతీయత రంగాలకు సంబంధించిన నిబంధనల్లో అనేక సవరణలకు యూఏఈ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో పాత నిబంధనల మేరకు ప్రవాసీయులకు నివాస అనుమతులు, వీసాల జారీ, ఎంట్రీ పర్మిట్లు, గుర్తింపు కార్డుల జారీ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అంటే పాత నిబంధనల ప్రకారం ఇక వీసాలు, గుర్తింపు కార్డుల జారీ ఉండదు. ఇక జులై 12 నుంచి కొత్త నిబంధనల మేరకు బకాయి ఫీజులను వసూలు చేస్తూ సేవలను కొనసాగించనున్నారు. ఈ బాధ్యతను ఐడెంటిటీ, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి చేసిన సవరణల ప్రకారం..ఎమిరాతీలు, జీసీసీ దేశాల పౌరులు, దేశంలో ఉన్న నివాసితులు తమ డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇక దేశంలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నెల రోజుల్లోగా ఎమిరాతిలు, జీసీసీ దేశాల పౌరులు, నివాసితులు(విదేశాల్లో 6 నెలల కంటే తక్కువ కాలం ఉన్నవారు) తమ డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మార్చి 1 నాటికే రెసిడెన్సీ వీసా గడువు ముగిసి ఇంకా విదేశాల్లోనే ఉన్న వారు, విదేశాల్లోనే ఆరు నెలలకు మించి ఉన్న వారికి డాక్యుమెంట్ల రెన్యూవల్ లో కొంత ఊరట కల్పించింది. వారు ఉంటున్న దేశం నుంచి యూఏఈకి విమాన సర్వీసులు ప్రారంభం అయిన నాటి నుంచి నిర్ణీత కాలంలోగా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే..ఈ నిర్ణీత కాలం ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. పైన పేర్కొన్న గ్రేస్ పిరియడ్ లోపు సేవలు పొందెందుకు ఎలాంటి జరిమానాలు ఉండవు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఫైన్ విధిస్తారు. అయితే..మిగిలిన సేవలకు మాత్రం అడ్మినిస్ట్రేటీవ్ ఫీజులు, ఫైన్లు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com