సింగపూర్‌లో మళ్లీ అధికార పార్టీకే పట్టం కట్టిన ప్రజలు
- July 11, 2020
సింగపూర్:సింగపూర్‌లో శుక్రవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ అధికార పార్టీకే పట్టం కట్టారు. అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) 61.2 శాతం ఓట్లతో విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 93 స్థానాల్లో.. 83 సీట్లను పీఏపీ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ 10 స్థానాలను సొంతం చేసుకుంది. కాగా, అధికార పార్టీకి 2015లో 71 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం 10 శాతం ఓట్లు తగ్గాయి.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సింగపూర్ దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ముఖానికి మాస్క్, చేతులకు గ్లోజులు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో 2.65 మిలియన్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార పీఏపీ సింగపూర్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రస్తుత ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ మరోసారి పదవిని చేపట్టనున్నారు.
అధికార పీఏపీ దేశంలో 1959 నుంచి అధికారంలో కొనసాగుతున్నది. సింగపూర్ పితామహుడిగా పిలుచుకునే లీ కువాన్ యూ దేశ ప్రధానిగా 1990 వరకు కొనసాగారు. ప్రస్తుత ప్రధాని లీ సీన్ లూన్ 2004 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ఆయన ప్రకటించారు.సింగపూర్ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పార్టీ జెండాలు చేతబట్టుకొని విజయోత్సవం జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







