సల్మాబాద్‌లో కారులో మృతదేహం

- July 11, 2020 , by Maagulf
సల్మాబాద్‌లో కారులో మృతదేహం

మనామా‌:54 ఏళ్ళ వ్యక్తి మృతదేహాన్ని ఓ కారులో కనుగొన్నారు. సల్మాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. నార్తరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ ఈ ఘటనపై సమాచారం అందుకోగా, సంఘటనా స్థలానికి సివిల్‌ డిఫెన్స్‌ ముందుగా చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. నేరపూరిత చర్య వున్నట్లుగానే ఈ ఘటనపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అథారిటీస్‌, ఈ కేసు విషయమై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com