బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి.. 400 కుటుంబాలకు సాయం
- July 13, 2020
ముంబై:బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకునే సమయంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులను ఇప్పటికే ఈ విషయమై సంప్రదించారు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోనూ సోమవారం ప్రకటించారు. కాగా, సోనూ లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రత్యేకంగా బస్సులను, చార్టెడ్ ప్లైట్ లను ఏర్పాటు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







