తెలంగాణ:సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
- July 13, 2020
హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగించింది హైకోర్టు. ఈ నెల 15 వరకూ కూల్చివేత పనులు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని షీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయంత్రంలోగా వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అటు భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిచిపోయాయి. దీంతో శనివారం సచివాలయ భవన కూల్చివేత ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం వరకు సచివాలయ భవనాల కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







