మస్కట్:స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వీక్షణ
- August 11, 2020
మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ లోని భారత రాయభారి కార్యాలయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15న మస్కట్ లోని భారత రాయభారి కార్యాలయం లో వేడుక జరుగుతుందని, కానీ, వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత రాయభారి కార్యాలయం లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ను రావద్దని కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
74వ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాయభారి మును మహావర్, ఆగస్ట్ 15న ఉదయం 08:45కు జండా వందనం కావించి భారత రాష్ట్రపతి యొక్క సందేశాన్ని చదువుతారు.ఈ వేడుకలకు కేవలం భారత రాయభారి కార్యాలయం అధికారులు మాత్రమే హాజరవ్వనున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ వేడుకలకు అనుమతించబడరు, అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షిండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని రాయభారి కార్యాలయం స్పష్టం చేసింది.
ఫెస్బుక్ లో వీక్షించేందుకు: @IndiaInOman
ట్విట్టర్ లో వీక్షించేందుకు: @Indemb_Muscat
ఇంస్టాగ్రామ్ వీక్షించేందుకు:@indemb_muscat
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







