తొలి కరోనా వాక్సిన్‌ను విడుదల చేసిన రష్యా
- August 11, 2020
రష్యా:ప్రపంచంలో తొలి కరోనా వాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకునట్లు వెల్లడించారు. తన కూతురికి కూడా వాక్సిన్ షాట్ ఇచ్చారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచంలో ఇదే తొలి కరోనా వాక్సిన్ అని ఆయన పేర్కొన్నారు.
వాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పుతిన్. యావత్ ప్రపంచానికి ఇది ఎంతో కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. త్వరలోనే కరోనా వాక్సిన్‌ను ఉత్పత్తిని వేగవంతం చేసి.. ప్రపంచమంతటికీ సరఫరా చేస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు విడుదల చేసిన వాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జూన్ 18న ఈ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 38 మంది వాలంటీర్లపై ఔషధ ప్రయోగాలు చేశారు. ఫస్ట్ బ్యాచ్ వాలంటీర్లు జులై 15న డిశ్చార్జి అయ్యారు. సెకండ్ బ్యాచ్ వాలంటీర్లు జులై 20న డిశ్చార్జి అయ్యారు. వీరందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరిగింది.
తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వనున్నారు. ఈ టీకాలను రెండు చోట్ల తయారు చేయనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో వెల్లడించారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, బిన్నోఫార్మా అనే కంపెనీల్లో కరోనా వాక్సిన్‌లను తయారు చేయనున్నారని తెలిపారు. ఈ వాక్సిన్‌పై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, దేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) చూసుకుంటుందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా వాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. కరోనాను తరిమికొట్టేందుకు ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. ఇందులో నాలుగు వాక్సిన్‌లు చివరి దశ ఉన్నాయి. ఆస్ట్రాజెనికా, మోడెర్నా కంపెనీలు అభివృద్ధి చేసిన ఫేజ్-3 హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించున్నారు. తుది దశ విజయవంతమైతే వీటిని కూడా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







